ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఏపీలో పర్యటనలో బాగంగా.. జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. ప్రధాని తిరిగి వెళ్లేంతరకు ఆయనతోనే ఉండనున్నారు. ప్రధానికి వీడ్కోలు పలికిన తర్వాత తిరుగు పయనం కానున్నారు.
రేపు సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ విశాఖ బయలు దేరతారు. సాయంత్రం 6.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. 6.35 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకనున్నారు. అనంతరం రాత్రికి పోర్ట్ గెస్ట్ హౌస్‌లో బసచేస్తారు.
నవంబర్ 12వ తేదీ ఉదయం 10.05 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకనున్నారు. 10.30 – 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్ధాపనలు, ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు. నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ప్రధాని ప్రారంభించనున్న ప్రాజెక్టు వివరాలు… 460 కోట్ల రూపాయల విలువైన రైల్వే రీడెవలప్మెంట్ పనులు, 152 కోట్ల రూపాయల విలువైన ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు, 566 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన షీలా నగర్, కాన్వెంట్ రోడ్ విస్తరణ పనులు, 2658 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు GAIL పైప్‌లైన్ పనులు, 211 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ఇచ్చాపురం, పర్లాకిమిడి రోడ్డు విస్తరణ పనులు, 2917 కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడిన ONGC ఫీల్డ్ డెవలప్మెంట్ పనులు, 3778 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన విశాఖ రాయ్‌పుర్ గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్