WGL: పర్వతగిరి మండలం చౌటపల్లి సొసైటీ పరిధిలో యూరియా పంపిణీపై వివాదం చెలరేగింది. సొసైటీ గేటు ఎదుట నోటీసు ప్రదర్శించి, 10 గ్రామాల్లో కేవలం నాలుగు గ్రామాలకే యూరియా ఇస్తామని, మిగతా గ్రామాలకు తర్వాత దఫాలో అందిస్తామని పేర్కొనడంతో రైతులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయంపై ఆయా గ్రామాల రైతులు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.