కృష్ణా: కంకిపాడు మండలం ఉప్పులూరు, తెన్నేరు సహకార సంఘాల్లో యూరియా పంపిణీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బంగార్రాజు బుధవారం పరిశీలించారు. తీవ్ర కొరతను ఎదుర్కొంటున్న యూరియా సరఫరా రైతులకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్టాక్ వివరాలు తెలుసుకుని అధికారులను సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.