నల్గొండ పట్టణంలోని స్థానిక జియల్ గార్డెన్స్‌లో ఇవాళ సీపీఐ జాతీయ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు, జిల్లా సీపీఐ పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు. మండలి ఛైర్మన్ మాట్లాడుతూ.. సురవరం సేవలు కొనియాడారు.