NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పింస్తామని వైస్‌ఛాన్స్‌లర్ యాదగిరిరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఇంజినీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. TU ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అనేది ఎన్నో ఏళ్ల కల అని అన్నారు.