NGKL: గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ కల్వకుర్తి మండల అధ్యక్షుడు దారమోని గణేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్వకుర్తిలో నాయకులు బుధవారం మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. తక్షణం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ను కోరారు.