MDK: జిల్లాలో ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను జడ్పీ సీఈవో సీహెచ్ ఎల్లయ్య ప్రకటించారు. జిల్లాలో 21 మండలాలలో 21 జడ్పీటీసీ స్థానాలు, 190 ఎంపీటీసీ స్థానాలు, 1052 పోలింగ్ కేంద్రాలు నిర్ణయించారు. జిల్లాలో 2,51,532 మంది పురుష, 2,71,787 మంది మహిళా ఓటర్లు, 8 మంది ఇతర ఓటర్లుగా మొత్తం 5,23,327 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు.