W.G: రసాయన రహిత వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 75 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు నడుస్తోందన్నారు.