KDP: జిల్లా RCM బిషప్ హౌస్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొడవటికంటి నాగరాజు ఇవాళ డిమాండ్ చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగ నియమకాలలో ప్రభుత్వ, విద్యాశాఖ, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను దళారులుగా నియమించిందన్నారు.