ADB: గ్రామాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. రెండవ విడత పరీక్షలో అర్హత పొందిన జీపీవోలకు బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అధికారులు తదితరులున్నారు.