SRPT: సమాజంలో గురు – శిష్య బంధం ఎంతో పవిత్రమైనదని,విద్యార్థులకు సరైన విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తులో సత్ప్రవర్తన కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దటంలో,ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు..