NZB: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం నిజామాబాద్ గోశాల రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహించారు. స్కూటీలో రవాణా చేస్తున్న 609 గ్రామాల నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడినట్లు వారు చెప్పారు. రవాణా చేస్తున్న NZB కోజా కాలనీకి చెందిన అబ్దుల్ మాలిక్‌ను అరెస్ట్ చేసినట్లు AES విలాస్ తెలిపారు. ఈ తనిఖీల్లో CI స్వప్న, SI రాంకుమార్, HCలు రాజన్న, నారాయణరెడ్డి పాల్గొన్నారు.