E.G: రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ విజయవాడ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఛైర్మన్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో కొవ్వూరు మండలం కాపవరం గ్రామ సొసైటీ ఛైర్మన్ సుంకర సత్తిబాబు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అభివృద్ధికి తీసుకోవాల్సిన విధివిధానాల గురించి శిక్షణలో తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు.