ఖమ్మం టేకులపల్లి ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తెలిపారు. HYD అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. D/B ఫార్మసీ, SSC ఆపైన విద్యార్హత కలిగిన 18 నుండి 35 సం.రాలు కలిగిన వారు అర్హులన్నారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.