ELR: పశ్చిమగోదావరి జిల్లా కార్యనిర్వహణ అధికారి శ్రీహరి బుధవారం లింగపాలెం మండలం రంగాపురం గ్రామపంచాయతీ శానిటేషన్ పనులు పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలకు పారిశుద్ధ్యం, ఆరోగ్య అభివృద్ధిపై అవగాహన కల్పించాలని చెప్పారు. డిప్యూటీ మండల పరిషత్ అధికారి సుందరి, పంచాయితీ కార్యదర్శులు ఆయన వెంట ఉన్నారు.