ATP: గుత్తి మండలం వన్నెదొడ్డిలోని పొలాల్లో కేబుల్ వైర్లు, ఎత్తుకెళ్లే దొంగలను రైతులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. రంగస్వామి, కుళ్లాయప్ప పొలాల్లో కేబుల్ వైర్లను ఎత్తుకెళ్తున్న ఇద్దరు దొంగలను రైతులు బుధవారం తెల్లవారుజామున రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి, పోలీసులుకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.