GNTR: విశాఖపట్నంలో వచ్చే నెల 13 నుంచి 15 వరకు జరిగే రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులైన సంజన, ధరణి ఎంపికయ్యారు. బుధవారం ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అశోక్ కుమార్, పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు, పీడీ తన్నీరు శివరామయ్య, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు వారిని అభినందించారు.