KMM: గడువులోగా జిల్లాలోని అన్ని మిల్లులు కస్టమ్ మిల్లింగ్ రైస్ ను పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండలంలోని రేషన్ దుకాణాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనిఖీ చేశారు. బియ్యం యొక్క పరిమాణం, నాణ్యతపై రేషన్ కార్డు దారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.