JN: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బుధవారం ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆవిష్కరించారు. ఈ ప్రాంత భూస్వాములపై ఓబన్న తిరగబడి ఉద్యమించిన తీరును వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓబన్న పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.