ATP: బ్రహ్మసముద్రం మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి రాఘవేంద్ర సెపక్ తక్రా అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ ఇబ్రహీం, హెచ్ఎం చంద్రమౌళి బుధవారం మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 13, 14వ తేదీల్లో ఉరవకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారన్నారు.