KDP: నంది మండలం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని నందిమండలం సచివాలయం – 2నందు జరిగిన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉమా మహేశ్వర్ తనిఖీ చేశారు. ఆయన వ్యాక్సిన్ కోల్డ్ చైన్‌ను పరిశీలించి, తల్లులతో వారి బిడ్డలకు అందుతున్న టీకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏఎన్ఎమ్ పలు రికార్డ్స్ పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు.