KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటయ్య నగర్లోని ఓ ఇంట్లో ఇవాళ పట్టపగలే దొంగతనం జరిగింది. ఇంటి తాళాలను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 12 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.