ATP: గుంతకల్లులోని మేరీ మాత చర్చి వద్ద ఈనెల 8న మారుతి ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన మోటర్ బైక్ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. మేరీ మాత చర్చి వద్ద పార్కింగ్ చేసి ఉన్న బైకును దుండగులు ఎత్తుకెళ్లారని, పరిసర ప్రాంతాలలో వెతికిన బైకు దొరకకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.