కోనసీమ: రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెం శెట్టిబలిజ రామాలయం వద్ద ప్రభుత్వం నూతనంగా రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి స్మార్ట్ కార్డులు అందించారు.