PPM: ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండ గ్రానైట్ కంపెనీలకు సహజ సంపదను అమ్మడమే కూటమి ప్రభుత్వం విధానమా అని గిరిజనసంఘం నాయకులు పాలక రంజిత్ ప్రశ్నించారు. పార్వతీపురం (M) కారాడవలస,పెదబొండపల్లి రెవెన్యూ పరిధిలోని వెలుగుల మెట్టను గ్రానైట్ కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించిన సందర్భంగా ప్రజలందరు వద్దన్న సందర్భంగా త్రవ్వకాలను మానుకోవాలన్నారు.