PPM: నాటుసారా నిర్మూలనలో భాగంగా చేపట్టిన నవోదయం 2.0 కార్యక్రమాన్ని పాలకొండలో నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాను, నగర పంచాయతీ ఛైర్పర్సన్ మల్లేశ్వరి, ఎస్సై ప్రయోగమూర్తి పాల్గొన్నారు. సారా నిర్మూలనకు అందరూ సహకరించాలని సూచించారు.