KNR: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెన్నంపల్లిలో బుధవారం ప్రముఖ సైకాలజిస్ట్ సోరుపాక ఐలయ్య విద్యార్థులకు ప్రయోగాత్మకమైన శిక్షణను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ లక్ష్య సాధనలో ఏ రకంగా ముందుకు దూసుకువెళ్లాలో మనసుకు హత్తుకొనే దృష్టంతాలతో వివరించారు. విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఏరకంగా ఉపయోగించుకోవాలో తెలిపారు.