AP: మెడికల్ కాలేజీలు అంటే తెలియని వ్యక్తి జగన్ అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. 50శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తాయన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి.. ‘మీరేం చేశారో చెప్పండి.. మేం ఏం చేశామో చెప్తాం’ అని అన్నారు. భూములు ఇవ్వగానే అది మెడికల్ కాలేజీ అయిపోదన్నారు.