MBNR: బాలానగర్ మండలంలోని రైతులు యూరియా కోసం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద బుధవారం బారులు తీరారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో రేపటి కోసం కొందరు రైతులు వినూత్నంగా తమ పేర్లు, సంచుల సంఖ్య, గ్రామం పేరును కాగితంపై రాసి, రాళ్లను క్యూ లైన్లో పెట్టారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.