E.G: ఉపాధి హామీ, అటవీ హక్కుల, సమాచారం చట్టాలు తీసుకురావడంలో CPI జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పాత్ర కీలకం అని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రాజమండ్రిలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభ CPI జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ఇందులో భాగంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.