JDWL: అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.