TPT: ఉపాధి హామీలో పంట సంజీవని, ఫారం పాండ్ రైతుల పాలిట వరం అని డ్వామా పథక సంచాలకులు సి.వి. శ్రీనివాస ప్రసాద్ అన్నారు. బీఎన్ కండ్రిగ మండలం వేణుగోపాల పురం పంచాయతీలో జరుగుతున్న ఫారం పాండ్ పనిని ఇవాళ ఆయన పరిశీలించారు. ప్రతీ రైతు తమ పొలాల్లో ఫారం పాండ్లు తవ్వుకోవడం వన భూగర్భ జలాలు వృద్ధి చెందడమే కాకుండా, భూసారం కూడా పెరుగుతుందన్నారు.