CTR: వెదురుకుప్పం మండలం పెరుమాళ్ళ పల్లి రైతు సేవా కేంద్రంలో పట్టు రైతులకు ఇవాళ ‘నా పట్టు నా అభిమానం’పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీరికల్చర్ జాయింట్ డైరెక్టర్ పద్మమ్మ రైతులకు పట్టు పురుగులు పెంపకం మీద అవగాహన పెంపొందించారు. మల్బరి తోటలు పెంపకంలో వాడే ఎరువులు, భూసార పరీక్ష గురించి రైతులకు వివరించారు.