CTR: కుప్పం ఎంపీడీవోగా వెంకటేశ్వర్లు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పని చేస్తున్న ఆయన బదిలీపై కుప్పం వచ్చారు. అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేస్తూ మండల అభివృద్ధికి శక్తి వంచనతో కృషి చేస్తానని ఎంపీడీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.