WGL: ప్రజా ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ 42వ డివిజన్‌కు చెందిన 34 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజు, స్థానిక కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు.