అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఇవాళ మదనపల్లె నుంచి ముదివేడుకు టమోటో కోత కోసేందుకు వెళుతున్న 11 మంది కూలీలు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. CPM నాయకులు వారిని పరామర్శించారు. ఉపాధి హామీ పనులు అమలు చేయాలని కోరారు.