ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పుష్పగచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన హెలికాప్టర్లో అనంతపురానికి బయలుదేరారు. సూపర్ హిట్ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సభ ముగిశాక పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి మంగళగిరికి వెళ్తారు.