‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎన్టీఆర్-కొరటాల శివ’ కాంబినేషన్లో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో.. అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్,యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రీసెంట్గా బయటికొచ్చిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫోటో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. త్వరలోనే లాంఛనంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
దాంతో ఎన్టీఆర్ 30 టీమ్ లొకేషన్ వేటలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం చిత్ర యూనిట్ లొకేషన్ల కోసం గోవా వెళ్లినట్టు సమాచారం. అలాగే మరోవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్‌గా జరుగుతోందట. అంతేకాదు.. త్వరలోనే అనిరుధ్‌తో కొరటాల శివ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ 30 టార్గెట్ కూడా ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల మాట. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా సందర్భంగా.. అక్టోబర్ మూడో వారంలో రిలీజ్ చేసే ఆలోచలనో ఉన్నారట.
అందుకే పక్కా ప్లానింగ్‌తో కొరటాల రంగంలోకి దిగబోతున్నాడట. పైగా ఆచార్య ఎఫెక్ట్ కొరటాల పై గట్టిగానే పడడంతో.. ఎన్టీఆర్ 30తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమా విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు ఎన్టీఆర్-కొరటాల టైం స్టార్ట్ అయినట్టేనని చెప్పొచ్చు. మరి ఆచార్య ఫ్లాఫ్‌ను ఎన్టీఆర్ 30 మరిపిస్తుందేమో చూడాలి.