AP: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టారు. తిరుమల పవిత్రతను కాపాడాలని సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. కాలినడక మార్గంలో భక్తులు కొన్ని సమస్యలు తెలిపారని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.