TG: BRS నుంచి సస్పెండైన నేపథ్యంలో కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. ఇంకా పెండింగ్లోనే ఉంది. వారం రోజులైనా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు BRS పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసిన కవిత జాగృతిని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు సంఘాలు, ఆయా రంగాల మేధావులు, నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.