JGL: జగిత్యాల పట్లణ కేంద్రంలో రూ. 2.50 లక్షల LOC చెక్కును కోరుట్ల MLA సంజయ్ బాధితులకు అందజేశారు. చింతకుంట వాడకు చెందిన నక్క సుజాత కంటి సమస్యతో బాధపడుతూ ఆర్థికంగా చికిత్స చేసుకునే స్తోమత లేక ఇబ్బందులకు గురవుతుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక మాజీ కౌన్సిలర్ బాలేశంకర్ సుజాత ఆరోగ్యస్థితిని MLA కి తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి నుంచి LOC ని మంజూరు చేశారు.