KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పంచాయతీలోని గ్రామ సచివాలయాల్లో సిబ్బంది లేక పోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10:40 గంటలు కావస్తున్నా కేవలం ఒకరిద్దరు మాత్రమే హాజరయ్యారన్నారు. ఈ మేరకు వివిధ పనులపై వచ్చిన లబ్ధిదారులు వెనుతిరిగి వెళ్లారు. ఈ విషయంపై ఎంపీడీవో ఫణి రాజకుమారిని వివరణ కోరగా గైర్హాజరైన సిబ్బందికి నోటీసులు జారీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు.