TPT: శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సోమయ్య ప్రమాదానికి గురై అకాల మరణం చెందాడు. కాగా, మృతుడు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుడుగా ఉన్నాడు. దీంతో బుధవారం ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ఆధ్వర్యంలో రూ.ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.