WGL: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా అధికారి అపర్ణ తెలిపారు. ఈనెల 12న ఉదయం 9 గంటలకు రాయపర్తి గురుకుల పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్, ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.