నల్లగొండ జిల్లాలో కూరగాయల సాగు ఏటేటా తగ్గుముఖం పడుతోంది. సాగు గిట్టుబాటుకాకపోవడం, ప్రభుత్వం రాయితీలు కల్పించకపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, దళారులు రంగప్రవేశం చేయడం వంటి కారణాలతో రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదేళ్ల క్రితం 42 వేల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. ప్రస్తుతం 80 శాతం సాగు పడిపోయింది.