కృష్ణా: ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి కళా ఉత్సవ్-2025 పోటీలను ఈనెల 11, 12 తేదీల్లో అంగలూరు డైట్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఈవో యు. వి. సుబ్బారావు తెలిపారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 9, 10, 11,12 తరగతులు చదివే విద్యార్థులు ఈ పోటీకి అర్హులన్నారు.