MDCL: మేడిపల్లిలో తన భార్య స్వాతిని హత్యచేసిన కేసులో నిందితుడు మహేందర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. తానే గొంతు నులిమి చంపానని గతంలో వాంగ్మూలం ఇచ్చిన మహేందర్.. ప్రస్తుతం ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు. కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు అతడిని 5రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుంది.