GDWL: ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ పోరాటమని కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంఛార్జ్ సరితమ్మ అన్నారు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు.