SRD: గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పటాన్చెరు మండలంలో చోటుచేసుకుంది. బుధవారం ఔటర్ రింగ్ రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పటాన్చెరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.