కృష్ణా: చల్లపల్లి మండలం పాగోలు పంచాయతీ మేకావారిపాలెం సొసైటీలో బుధవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. మేకావారిపాలెం సొసైటీకి ఇరవై టన్నుల (445 బస్తాలు) యూరియా వచ్చింది. సొసైటీ ఛైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ, సభ్యులు వక్కలగడ్డ శివరామకృష్ణ, చిటికినేని శ్రీనివాసరావు, సీఈవో కోరుకొండ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు యార్లగడ్డ శ్రీనివాసరావు పాల్గొన్నారు.